One of my favourite lyrics
నీలాకాశం లో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలిగింతలు మొదలాయే ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లే రా సుకుమారా
ఈ మాయ నీవల్లే రా
ఎదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళు లేదిలా
సరదాకైన ఏ ఆడపిల్లైన
నిను చూస్తుంటే వుండగలనా
నిన్నే దాచేసి లేవుపొమ్మంటా
నీకే నిన్నే ఇవ్వనంటా
నిన్నే తాకిందని గాలి తోటి
రోజూ గొడవేనంట
నిన్ను నువ్వైన నాలాగ ప్రేమించలేవంట
నీలకాశం లో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
రహదారుల్లో పూలు పూయిస్తా
నాదారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా
నాపై కన్నె వేస్తానంటే
అరే ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే
ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకిష్టం
నీలాకాశం లో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలిగింతలు మొదలాయే ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లే రా సుకుమారా
ఈ మాయ నీవల్లే రా
ఎదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళు లేదిలా
No comments:
Post a Comment